కేరళ వయనాడ్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ముండకై, సురల్‌మలై, అట్టమలై, నుల్‌పుజా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.కొండచరియలు విరిగిపడి అక్కడ మూడు గ్రామాలు మట్టిలో కూరుకుపోయాయి. 280 మందికి పైగా మరణించగా 200 మందికి పైగా గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడిన ప్రజలను రక్షించేందుకు అనేక రెస్క్యూ టీమ్‌లు పగలు, రాత్రి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. పలువురు ప్రముఖులు తమ సహాయాన్ని అందించారు. కమల్ హాసన్, విక్రమ్, విజయ్‌తో సహా చాలా మంది కోలీవుడ్ సినీ తారలు సోషల్ మీడియా ద్వారా వాయనాడ్ ప్రజలకు తమ మద్దతును అందించారు. వారు ఆర్థిక సహాయం కూడా అందించడానికి సిద్దమవుతున్నారు. ఈ నేపధ్యంలో కేరళ సహాయ కార్యక్రమాల్లో సహాయం చేయడానికి, నటులు సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. కేరళల ప్రజలకు తమ సానుభూతిని తెలియజేశారు. వాయనాడ్ కొండచరియల బాధితుల సహాయార్థం నటుడు విక్రమ్ కేరళ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి రూ.20 లక్షల విరాళం అందించారు.
కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు విరాళం
الخميس، 1 أغسطس 2024
cinema kerala tamilnadu కార్తీ రూ. 50 లక్షలు విరాళం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు సూర్య జ్యోతిక విక్రమ్ కేరళ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి రూ.20 లక్షల విరాళం
ليست هناك تعليقات:
إرسال تعليق