ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు వచ్చింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల తరపు న్యాయవాది అశ్వనీకుమార్ సూచించారు. అయితే రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న కోర్టులోనే విచారించాలని పిన్నెల్లి తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. ఇవన్నీ నిశితంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.
పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ 14కు వాయిదా !
الاثنين، 12 أغسطس 2024
Andhra Pradesh నిశితంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి వెల్లడి పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ 14కు వాయిదా మాచర్ల మాజీ ఎమ్మెల్యే
ليست هناك تعليقات:
إرسال تعليق