దేశీయ మార్కెట్లో జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్, టైగన్ SUVలపై డిస్కౌంట్లు ఇచ్చింది. కంపెనీ అందిస్తున్న ఆఫర్లలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపుతో సహా పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. టిగువాన్ కారుపై రూ.3.4 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీపై డిస్కౌంట్‌లో నాలుగేళ్లపాటు రూ.90,000 వరకు సేవా విలువ ప్యాకేజీ కూడా ఉంది. దీనిపై కంపెనీ రూ.75,000 క్యాష్ డిస్కౌంట్, రూ.75,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.లక్ష వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కారు ధర మార్కెట్లో రూ. 35.17 లక్షలు ఉంది. వోక్స్‌వ్యాగన్ టైగన్ కాంపాక్ట్ SUVపై రూ. 1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్ ప్రకటించారు. అంతేకాకుండా.. GT 1.5L వేరియంట్‌లో రూ. 73,900 విలువైన స్పెషల్ కిట్ కూడా అందిస్తున్నారు. అయితే.. ఈ కారు పరిమిత స్టాక్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. GT 1.5L TSI DST వేరియంట్ ధర రూ. 1.37 లక్షలు తగ్గింది. దీనిపై ఎలాంటి ఎక్స్ఛేంజ్ బోనస్ లేదు. ఈ కారు డిస్కౌంట్లతో కలిపి ధర రూ. 15.99 లక్షలకు లభించనుంది. వోక్స్‌వ్యాగన్ వర్టస్ కారుపై 75,000 రూపాయల నగదు తగ్గింపును ఇస్తోంది. అలాగే.. Xend తగ్గింపు రూపంలో రూ.70,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో మొత్తం.. రూ.1.45 లక్షల తగ్గింపు లభిస్తోంది. వోక్స్‌వ్యాగన్ ఈ కాంపాక్ట్ సెడాన్ యొక్క బేస్-స్పెక్ కంఫర్ట్‌లైన్ 1.0L TSI MT వేరియంట్‌ను రూ. 10.90 లక్షల తగ్గింపు ధరతో అందిస్తోంది. ఇంతకుముందు కంటే రూ. 66,000 తక్కువకు లభించనుంది. వోక్స్‌వ్యాగన్ వర్టస్ ధర రూ. 10.90 లక్షల నుండి రూ. 19.41 లక్షల మధ్య ఉంది.
వోక్స్‌వ్యాగన్ టిగువాన్, టైగన్ కాంపాక్ట్ SUV, వర్టస్ కార్లపై డిస్కౌంట్ ఆఫర్ !
الجمعة، 12 يوليو 2024
automobile electric car science technology ఎక్స్ఛేంజ్ బోనస్ కార్పొరేట్ తగ్గింపుతో సహా పలు రకాల ఆఫర్లు టైగన్ కాంపాక్ట్ SUV నగదు తగ్గింపు వర్టస్ కార్లపై డిస్కౌంట్ ఆఫర్ వోక్స్‌వ్యాగన్ టిగువాన్
ليست هناك تعليقات:
إرسال تعليق