భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు టీమ్ ఇండియా జెర్సీని బహూకరించి, టీ20 ప్రపంచకప్ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం అభినందించారు. సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్ పరిసరాల్లో స్థలం గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత అజహరుద్దీన్ పాల్గొన్నారు. ఇటీవల టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో సిరాజ్ ఉన్నారు. ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు.
మహమ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం !
الثلاثاء، 9 يوليو 2024
telangana కాంగ్రెస్ సీనియర్ నేత అజహరుద్దీన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మహమ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ليست هناك تعليقات:
إرسال تعليق