లెనోవో నుంచి మిడ్‌ రేంజ్‌ ట్యాబ్‌ ప్లస్‌ విడుదల !


దేశీయ మార్కెట్లో లెనోవో నుంచి మిడ్‌ రేంజ్‌ లో ట్యాబ్‌ విడుదల అయింది. ఈ ట్యాబ్‌ డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో జేబీఎల్ స్పీకర్లను కలిగి ఉంటుంది. 11.5 అంగుళాల 2k డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు డిజైన్‌ పరంగాను ఈ ట్యాబ్‌ ప్లస్‌ ఆకట్టుకొనే విధంగా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ కు కోసం ఎక్కువగా ట్యాబ్‌ వినియోగించే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ట్యాబ్‌ ప్లస్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ లెనోవో ట్యాబ్‌ ప్లస్‌ 11.5 అంగుళాలు 2k TUV సర్టిఫైడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ట్యాబ్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో అందుబాటులోకి వచ్చింది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సామర్థ్యంతో 8600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్‌ చేసేందుకు 90 నిమిషాల సమయం పడుతుంది. అయితే సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా 12 గంటలపాటు స్ట్రీమింగ్‌ సమయాన్ని పొందవచ్చని సంస్థ చెబుతోంది. ఈ ట్యాబ్‌ ప్లస్‌ మీడియాటెక్‌ Helio G99 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ ట్యా్బ్‌ గరిష్ఠంగా 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ఈ ట్యాబ్‌ IP52 డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ ట్యాబ్‌ ద్వారా సులభంగా చదువుకొనేందుకు మరియు డిజిటల్‌ ఫ్రేమ్‌, గడియారంగా కూడా మార్చుకోవచ్చు. 26W స్టీరియో సౌండ్‌ సిస్టమ్‌తోపాటు 8 JBL Hi-Fi స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇందులో 4 మ్యాట్రిక్స్‌ ట్వీటర్స్, 4 ఫోర్స్‌ బ్యాలెన్స్‌డ్ ఊఫర్స్‌ ఉన్నాయి. ఇవి డీప్‌ బాస్‌తో కూడిన అత్యంత మెరుగైన ఆడియోను అందిస్తాయి. సింపుల్‌ గా చెప్పాలంటే బ్లూటూత్‌ స్పీకర్లుగా పనిచేస్తాయి. ఈ ట్యాబ్‌ ప్రత్యేకమైన యాప్‌ వాల్యూమ్ కంట్రోల్‌ను కలిగి ఉంటుంది.


Post a Comment

0 Comments