ఈసారి కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరిగేలా ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్న క్రమంలో ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాబోదని అన్నారు. కేంద్ర నిధులను గత జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని, కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతోనే కేంద్ర పథకాలు ఆగాయన్నారు. జగన్ పాలనలో అవకతవకలు జరిగినట్లు కేంద్రం కూడా చెప్పిందన్నారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాబోదు: రామ్మోహన్ నాయుడు
السبت، 20 يوليو 2024
Andhra Pradesh national కేంద్ర నిధులను గత జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని రామ్మోహన్ నాయుడు విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాబోదు
ليست هناك تعليقات:
إرسال تعليق