గోంగూరలో విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కెరోటిన్ అధికంగా ఉంటాయి. మన శరీరానికి కావలసిన విటమిన్ సి 53 శాతం ఈ గోంగూర లో ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుంది. గోంగూర పూలను దంచి దాని నుండి రసం తీసి వడకట్టుకొని దానిలో ఒక అరకప్పు వరకు పాలు పోసుకొని ఉదయం సాయంత్రం రెండు పూటలా తాగితే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే గోంగూర ఆకుల పేస్ట్ ను తలకి అప్లై చేసుకొని కొంత సమయం తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. గోంగూరలో పొటాషియం మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నాయి. దీనిని తినడం వలన హై బీపీని నియంత్రించవచ్చు. గోంగూరను వారంలో మూడు నాలుగు సార్లు తిన్నట్లయితే హై బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడే వారు కూడా గోంగూరను తీసుకోవటం వలన ఉపశమనం కలుగుతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు గోంగూరను తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. గోంగూరలో ఉన్నటువంటి క్లోరోఫిల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అదుపులో ఉంచుతుంది. గోంగూర పులిహోర లాగా చేసుకుని కూడా తినవచ్చు. అలాగే ఈ గోంగూర నుండి తీసినటువంటి జిగురును నీటిలో కలుపుకొని తాగితే విరోచనాలు కూడా తగ్గుతాయి. మహిళలకు పీరియడ్స్ టైం లో కాళ్లు లాగటం, నడుము నొప్పి లాంటి సమస్యలతో ఎంతో ఇబ్బంది పడతారు.అలాగే ఎంతో నీరసంగా కూడా ఉంటారు. ఈ తరుణంలో గోంగూర ను తీసుకోవటం వలన శరీరానికి కావలసిన శక్తి అనేది వస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచటం లో, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేయడంలో గోంగూర ముఖ్య పాత్ర వహిస్తుంది. గోంగూరలో ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. దీనిని తీసుకోవటం వలన ఎముకలు అనేవి ఎంతో దృఢంగా తయారవుతాయి.
గోంగూర - ఆరోగ్య ప్రయోజనాలు !
الأربعاء، 31 يوليو 2024
arogyam Health Tips గోంగూర - ఆరోగ్య ప్రయోజనాలు పొటాషియం మరియు మెగ్నీషియం శరీరానికి కావలసిన విటమిన్ సి 53 శాతం గోంగూర లో ఉంటుంది
ليست هناك تعليقات:
إرسال تعليق