తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ రెండున్నర గంటల పాటు మాట్లాడారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించారు. రేవంత్ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. ఆ ఒక్క మాటతో సభ దద్దరిల్లింది. లీడర్ ఆఫ్ ది హౌజ్‌ని పట్టుకుని ఏకవచనంతో పిలవడం తప్పు అని స్పీకర్ మందలించడంతో కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకుంటానని అన్నారు. ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. “నేను రెండు మాస్టర్స్ చేసాను. గుంటూరులో చదివాను. ఆ తర్వాత న్యూయార్క్‌లో చదివాను. పోటీ పరీక్షలు రాసాను. ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. ఇది నా చదువు. మరి రేవంత్ గారు ఏం చదువుకున్నారో నాకైతే తెల్వదు. నేను రేవంత్ ఒకప్పుడు మంచి మిత్రులం. అసెంబ్లీలోనే కాదు బయట కూడా బాగానే ఉండేవాళ్లం. గత పదేళ్లలో మా స్నేహం చెడిన మాట వాస్తవం. ఏదేమైనప్పటికీ ఆయన ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారంటే అదృష్టవంతుడు. అలాంటప్పుడు ఆయన మూసీ నదిని లండన్ బ్రిడ్జ్‌గా, మహేశ్వరాన్ని న్యూయార్క్‌గా చేస్తానని ప్రకటించాడు. అలా చేస్తే మాకంటే ఎక్కువ ఎవ్వరూ సంతోషించరు“ అన్నారు.
నేను రేవంత్ ఒకప్పుడు మంచి మిత్రులం : కేటీఆర్
الأربعاء، 31 يوليو 2024
telangana కేటీఆర్ నేను రేవంత్ ఒకప్పుడు మంచి మిత్రులం లీడర్ ఆఫ్ ది హౌజ్‌ని పట్టుకుని ఏకవచనంతో పిలవడం తప్పు అని స్పీకర్ మందలింపు
ليست هناك تعليقات:
إرسال تعليق