భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం 34 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఆదివారం సాయంత్రం 7 గంటలకు 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్ల వద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరదనీరు పెరగడంతో భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు నీటిలో మునిగిపోయాయి. చర్ల మండలం వద్ద ఈత వాగుపై నుంచి వరదనీరు పారుతుండటంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం సీతవాగు, గుబ్బల మంగి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం వరదనీటితో మునిగింది. గోదావరి దిగువన ఉన్న శబరి నదికి వరదనీరు భారీగా పోటెత్తడంతో భద్రాచలం నుంచి వరద నీరు దిగువకు నెమ్మదిగా ప్రవహిస్తోంది. మరోవైపు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుత సామర్థ్యం 18.833 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి 14,063 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 1067.10 అడుగులకు చేరింది.
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ !
الأحد، 21 يوليو 2024
43 అడుగులకు చేరడంతో Andhra Pradesh telangana భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్ల వద్దని హెచ్చరికలు జారీ
ليست هناك تعليقات:
إرسال تعليق