సీనియర్ నటి పావలా శ్యామలా ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న సాయి తేజ లక్ష రూపాయాల ఆర్థిక సహాయాన్ని అందించారు. గతంలో పావల శ్యామలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా ఈ సహాయాన్ని అందజేశారు. సాయి దుర్గ తేజ్ ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని తనకు కష్టకాలంలో ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల పావల శ్యామల ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా సాయి దుర్గ తేజ్‌తో వీడియో కాల్‌లో కూడా మాట్లాడింది. ఇక సాయి తేజ భవిష్యత్‌లో కూడా అన్ని విధాల అండగా ఉంటానని పావల శ్యామలతో చెప్పాడు. ఇక ఇటీవలే సాయిధరమ్ తేజ్.. తండ్రీకూతుళ్లపై హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఓ వీడియో కించపరిచే విధంగా ఉందని ఆయనపై చర్య తీసుకునే విధంగా తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించాడు.
నటి పావల శ్యామలకు సాయి తేజ ఆర్థిక సహాయం !
الجمعة، 26 يوليو 2024
Andhra Pradesh cinema telangana నటి పావల శ్యామలకు సాయి తేజ ఆర్థిక సహాయం ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా అందజేత
ليست هناك تعليقات:
إرسال تعليق