జగన్‌ ఇంటి దగ్గర హైడ్రాలిక్‌ బొలార్డ్స్‌, టైర్ కిల్లర్స్‌ తొలగింపు


తాడేపల్లి లోని జగన్ నివాసం రోడ్డు ను పబ్లిక్ లోకి తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు జగన్‌ ఇంటి దగ్గర ఉన్న హై సెక్యూరిటీ ఏర్పాట్లను సైతం తొలగించింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన భద్రతలో భాగంగా తాడేపల్లి నివాసానికి వెళ్లే రోడ్డులో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్‌ బొలార్డ్స్‌, టైర్ కిల్లర్స్‌ను పూర్తిగా తొలగించారు. అలాగే జగన్ నివాసానికి పార్క్ విల్లాస్ ద్వారా వెళ్లే రోడ్డులో చెక్‌పోస్ట్‌లు ఉన్నాయి. వాటిని కూడా అధికారులు అక్కడి నుంచి తొలగించారు. తాడేపల్లి నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రోడ్డులో రాకపోకలు మరింత సులభంగా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే ఇంటికి సమీపంలో రోడ్డుపై వేసిన రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్లు, ఆంధ్ర రత్న పంపింగ్‌ స్కీం వైపు ఉన్నటువంటి పోలీసు చెక్‌పోస్టును అధికారులు తొలగించారు. జగన్ నివాసం దగ్గర తొలగించిన సామగ్రిని లారీలో అక్కడి నుంచి తరలించారు.

Post a Comment

0 Comments