న్డీఏ కూటమి శాసనసభ పక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ జగన్‌కు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తత్వం బోధపడినట్లు లేదన్నారు. జగన్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెప్తూ కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్‌ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతామనే భ్రమ నుంచి ప్రజలు బయట పడేసినా ఇంకా తనే సీఎం అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తాను, జనసేన పార్టీ నూటికి నూరు శాతం సహకరిస్తుందని స్పష్టం చేశారు.

Post a Comment

Previous Post Next Post