ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు పంపిన లింక్‌ను క్లిక్ చేస్తే చాలు సభ్యులుగా ఉండొచ్చని సైబర్ నేరగాళ్లు కొందరు పోలీసు సిబ్బందికి మెసేజ్‌లు పంపారు. నిజమేనని నమ్మిన ఇద్దరు కానిస్టేబుళ్లు లింక్ క్లిక్ చేశారు. సైబర్ దొంగలు వెంటనే ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేసే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న సిబ్బంది విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీకే ఫైల్స్ పేరుతో లింక్ వస్తే ఎవరూ క్లిక్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు ఉద్యోగులకు సూచించారు. కాంబోడియా కేంద్రంగా ఏపీకే ఫైల్స్ ముసుగులో సైబర్ దోపిడీ జరుగుతోందని విజయవాడ సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావు తెలిపారు.
ఏపీకే ఫైల్స్ ఎవరూ క్లిక్ చేయొద్దు : సైబర్ క్రైమ్ పోలీసులు!
الأحد، 21 يوليو 2024
Andhra Pradesh science technology ఏపీకే ఫైల్స్ ఎవరూ క్లిక్ చేయొద్దు సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాళ్లు కొందరు పోలీసు సిబ్బందికి మెసేజ్‌లు పంపారు
ليست هناك تعليقات:
إرسال تعليق