అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో అతిధిగా పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నాడు. 15వ ఎడిషన్‌లో ఇండియన్ ఆర్ట్ & కల్చర్ అంబాసిడర్ అవార్డును అందుకోనున్నారు. నటనా రంగంలో విశేషమైన కృషి కనబర్చిన చరణ్‌కు ఈ అవార్డును అందివ్వబోతుంది. ఈ అవార్డును అందుకోబోతున్న తొలి సెలబ్రిటీ రామ్ చరణ్ కావడం విశేషం. విక్టోరియన్ ప్రభుత్వం ప్రతి యేటా ఈ ఫెస్టివల్ ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. ఇదిలా ఉంటే.. ఈ అవార్డు దక్కడంపై చెర్రీ స్పందించాడు. మెల్‌బోర్న్‌లో భారత జాతీయ జెండాను ఎగురవేయడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. గౌరవ అతిథిగా రామ్ చరణ్ హాజరు కావడం తమకు ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందని ఐఎఫ్ఎఫ్ఎం ప్రెసిడెంట్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
రామ్ చరణ్‌కు ఇండియన్ ఆర్ట్ & కల్చర్ అంబాసిడర్ అవార్డు !
الجمعة، 19 يوليو 2024
cinema national ఆగస్టు 15 నుంచి 25 వరకు ఈ ఈవెంట్ జరగనుంది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో అతిధిగా రామ్ చరణ్‌కు ఇండియన్ ఆర్ట్ & కల్చర్ అంబాసిడర్ అవార్డు
ليست هناك تعليقات:
إرسال تعليق