రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ మహోత్సవం జూలై 12న వైభవంగా జరగనుంది. ఇటీవల వారి హల్దీ వేడుక, మెహందీ వేడుకను నిర్వహించారు. జులై 12న గ్రాండ్ గా జరగనున్న ఈ వివాహ వేడుకకు దేశ, విదేశాల్లోని అతిథులకు ఆహ్వానం అందింది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకపై ప్రపంచ వ్యాప్తంగా అందరిలో ఆసక్తి నెలకొంది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహాన్ని పురస్కరించుకొని గ్లోబల్ దిగ్గజాలు, ప్రపంచ నాయకులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు ఇప్పటికే దేశానికి చేరుకున్నారు. ప్రత్యేక అతిథుల కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మన దేశ ప్రధాన ఆర్థికవేత్తలు, ప్రస్తుత, మాజీ రాజకీయ నాయకులు అనంత్ రాధిక వివాహానికి హాజరుకానున్నారు. అగ్రశ్రేణి ప్రపంచ పెట్టుబడిదారులు మన దేశానికి రావడంతో భారతదేశ భవిష్యత్తుపై ప్రపంచ విశ్వాసాన్ని నొక్కి చెబుతుందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ప్రముఖ, నిష్ణాతులైన విద్యావేత్తలు, ఆవిష్కర్తలు, వైద్యులు కూడా వివాహానికి హాజరవుతారు. ఈ వివాహానికి వచ్చే వివాహ అతిథి జాబితా చూస్తే మన దేశ అంతర్జాతీయ ఆకర్షణను ప్రతిబింబిస్తుంది.
ホーム
/
హల్దీ వేడుక
/
అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు !
الخميس، 11 يوليو 2024
international national అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అనంత్ అంబానీ జూలై 12న మెహందీ వేడుకను నిర్వహించారు రాధికా మర్చంట్ వివాహ మహోత్సవం హల్దీ వేడుక
ليست هناك تعليقات:
إرسال تعليق