ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడు, అల్ ఖైదా ఉగ్రవాది అమిన్ ఉల్ హక్ అరెస్టయ్యాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉగ్రవాద నిరోధక విభాగం ఆధ్వర్యంలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు అతడిని అరెస్టు చేశాయి. ఈ సందర్భంగా సీటీడీ పంజాబ్ పోలీస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్ ద్వారా హక్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పలు గూఢచార సంస్థల సహకారంతో తమ విభాగం తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. అమిన్ ఉల్ హక్ 1996 నుంచి ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడని.. పంజాబ్ ప్రావిన్స్ అంతటా విధ్వంసకర చర్యలకు కుట్రలు చేశాడని తెలిపారు. ఉగ్రవాద నిరోధక విభాగం అసాధారణ కార్యాచరణ సామర్థ్యం, అంకిత భావం వల్లే హక్ ఆచూకీని గుర్తించి అరెస్టు చేయగలిగినట్లు చెప్పారు. అతడిపై కేసు నమోదు చేసిన సీటీడీ అధికారులు.. విచారణ కోసం రహస్య ప్రాంతానికి తరలించారు. హక్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిందని.. అతడి అరెస్టు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో గొప్ప విజయాన్ని సూచిస్తోందని తెలిపారు.
బిన్ లాడెన్‌కు సన్నిహితుడు అమిన్ ఉల్ హక్ అరెస్టు !
الجمعة، 19 يوليو 2024
international pakistan అల్ ఖైదా ఉగ్రవాది పంజాబ్ ప్రావిన్స్ అంతటా విధ్వంసకర చర్యలకు కుట్రలు బిన్ లాడెన్‌కు సన్నిహితుడు అమిన్ ఉల్ హక్ అరెస్టు లాడెన్‌కు అత్యంత సన్నిహితుడు
ليست هناك تعليقات:
إرسال تعليق