పారిస్ ఒలింపిక్స్ సమరంలో భారత్‌కు శుభారంభం దక్కింది. అధికారిక ఆరంభోత్సవం కంటే ఒక రోజు ముందుగానే మన అథ్లెట్లు బరిలో దిగారు. గురువారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత మహిళా ఆర్చర్లు అదరగొట్టారు. అంకిత భకత్ (11వ స్థానం, 666 పాయింట్లు), భజన్ కౌర్ (22వ స్థానం, 658 పాయింట్లు), దీపిక కుమారి (23వ స్థానం, 658 పాయింట్లు) సత్తా చాటారు. దీంతో టీమ్ ఈవెంట్‌లో భారత్ నాలుగో స్థానం (1983 పాయింట్లు) దక్కించుకుని నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ విభాగంలో దక్షిణాకొరియా (2046 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచింది. చైనా (1996 పాయింట్లు), మెక్సికో (1986 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటాయి. 5 నుంచి 12 స్థానాల్లో నిలిచిన టీమ్‌లు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ఆడతాయి. ఆర్చర్ల వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగానే టీమ్ సీడింగ్ కేటాయిస్తారన్న విషయం తెలిసిందే. జులై 28న జరగనున్న క్వార్టర్స్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. క్వార్టర్స్‌లో గెలిస్తే సెమీ ఫైనల్‌లో టాప్ సీడ్, బలమైన దక్షిణాకొరియాతో తలపడే అవకాశముంది. దక్షిణాకొరియా ఒలింపిక్స్ చరిత్రలో ఆర్చరీలో 27 బంగారు పతకాలు సాధించింది.
ホーム
/
భారత్‌కు శుభారంభం
/
పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన భారత మహిళల ఆర్చరీ జట్టు !
الخميس، 25 يوليو 2024
28న జరగనున్న క్వార్టర్స్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది national sports పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన భారత మహిళల ఆర్చరీ జట్టు భారత్‌కు శుభారంభం
ليست هناك تعليقات:
إرسال تعليق