హైదరాబాద్ లోని సనత్ నగర్ జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సి అపార్ట్ మెంట్ రెండవ అంతస్తులోని 204 ఫ్లాట్ లో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలు ఇంట్లోని బాత్రూంలో పడి ఉన్నాయి. మృతదేహాలను సాయంత్రం కాలనీవాసులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఆర్.వెంకటేష్ (55), మాధవి (50), హరి (30)గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
అపార్ట్మెంట్లో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి !
الاثنين، 22 يوليو 2024
Criem hyderabad telangana అపార్ట్మెంట్లో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి మృతదేహాలు ఇంట్లోని బాత్రూంలో పడి ఉన్నాయి సనత్ నగర్ జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సి అపార్ట్ మెంట్
ليست هناك تعليقات:
إرسال تعليق