హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ లో కరీంనగర్ కు చెందిన సౌమ్య(20) అనే యువతి వాసవీ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. శుక్రవారం సాయంత్రి డ్యూటీ వెళ్లాల్సి ఉండగా రాకపోవడంతో ఆమెకు స్నేహితుడు ప్రశాంత్ ఫోన్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆమె ఉండే రూమ్‌కు వెళ్లాడు. తలుపులు తెరిచి చూడా బాత్రూమ్ ఆమె అచేతనంగా పడిఉంది. వెంటనే అతడు హీటర్ స్విచ్ ఆఫ్ చేసి స్థానికుల సహాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహంపై కాలిన గాయాలు ఉండడంతో షార్ట్ సర్కూట్‌తోనే చనిపోయి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కరీంనగర్ కు చెందిన యువతిగా గుర్తించారు.
ప్రాణం తీసిన వాటర్ హీటర్ !
الأحد، 28 يوليو 2024
Criem hyderabad telangana కరీంనగర్ కు చెందిన సౌమ్య ప్రాణం తీసిన వాటర్ హీటర్ వాసవీ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది
ليست هناك تعليقات:
إرسال تعليق