ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత అయిదేళ్లూ ఇసుకను అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. బుధవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఎవరికి ఇసుక కావాలన్నా సులభంగా అందేలా చూస్తాం. వైకాపా అధికారంలోకి వచ్చినప్పుడు తొమ్మిది నెలల పాటు ఎవరికీ ఇసుక దక్కలేదు. 40 రంగాలు వారు దీనిపై ఆధారపడ్డారనే విషయాన్ని పట్టించుకోలేదు. లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయారు. నిధులు దోచుకోవాలనే ఉద్దేశంతో జేపీ సంస్థను తెర మీదకు తీసుకొచ్చారు. తర్వాత రకరకాలుగా దోపిడీకి పాల్పడ్డారు. ఎన్జీటీ వరకు ఈ వ్యవహారం వెళ్లింది. వర్షాకాలంలో కూడా ఇసుక లభ్యత ఉండేలా చూస్తాం. ఇసుక లోటు రాకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉచిత ఇసుక పంపిణీకి సంబంధించి విధి విధానాలు తయారు చేస్తున్నాం. ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. 2014-19 కాలంలో ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది తెదేపా ప్రభుత్వమే. వైకాపా అధికారంలోకి వచ్చాక దాన్ని దోచుకోవడానికి వాడుకుంది. ఈ విధానంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలు తయారు చేస్తున్నాం !
الأربعاء، 3 يوليو 2024
Andhra Pradesh ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలు తయారు చేస్తున్నాం గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామం
ليست هناك تعليقات:
إرسال تعليق