మహారాష్ట్రలో సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడితో సరికొత్త తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ బుధవారం వెల్లడించింది. ఛత్రపతి శంభాజీ నగర్‌లో గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు టయోటా ఒక ప్రకటనలో తెలిపింది. కర్ణాటకలో ప్రధాన కార్యాలయంతో పాటు ఇప్పటికే బెంగళూరు సమీపంలోని బిదాడిలో రెండు తయారీ యూనిట్లను కలిగి ఉంది. టయోటాకు సంబంధించిన ఎగుమతులు విలువ పరంగా సుమారు రూ.32 వేల కోట్లుగా ఉన్నాయి. టయోటా ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లలో 3.42 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
మహారాష్ట్రలో భారీ పెట్టుబడి పెట్టనున్న టయోటా !
الأربعاء، 31 يوليو 2024
automobile science technology ఛత్రపతి శంభాజీ నగర్‌లో గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రం ఏర్పాటు మహారాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం మహారాష్ట్రలో భారీ పెట్టుబడి పెట్టనున్న టయోటా
ليست هناك تعليقات:
إرسال تعليق