పాకిస్తాన్‌లోని పెషావర్ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SV792 విమానం ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ గేర్‌లో సమస్య కారణంగా టైర్‌కు మంటలు వచ్చాయి. దీనిని గమనించిన ఏటీసీ సిబ్బంది పైలట్‌ను అప్రమత్తం చేశారు. ఆ విమానాన్ని వెంటనే రన్‌వే వద్ద నిలిపివేశారు. ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులను కిందకు దించారు.మొత్తం 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బంది విమానంలో ఉన్నారు. అయితే టైరు పగిలిన సమాచారం అందడంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులందరినీ బయటకు తరలించారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ, అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటనను సౌదీ ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది.
పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు !
الخميس، 11 يوليو 2024
21 మంది సిబ్బంది 276 మంది ప్రయాణికులు international SV792 విమానం గేర్‌లో సమస్య కారణంగా టైర్‌కు మంటలు పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు
ليست هناك تعليقات:
إرسال تعليق