వేయించిన శనగలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కణాల నిర్మాణం, మరమ్మత్తు, కణాల పెరుగుదలకు, కండరాల ఆరోగ్యానికి, కండరాలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ గుప్పెడు వేయించిన శనగలు తీసుకుంటే ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. వీటిలో విటమిన్లు, కాల్షియం, ఐరన్, పిండి పదార్థాలు మొదలైనవన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. రోజూ వేయించిన శనగలు తీసుకుంటే శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది. ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం ఎంతో అవసరం. వేయించిన శనగలు సమతుల ఆహారంలో ఒక భాగమే అంటున్నారు నిపుణులు. సమతుల ఆహారంలో రోజుకు 100గ్రాముల వరకు వేయించిన శనగలను తీసుకోవచ్చునని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల మానసిక ఆరోగ్యం, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. శనగలలో ఉండే పోషకాలు మెదడు పనితీరును ప్రోత్సహిస్తాయి. వేయించిన శనగల్లో రాగి, ఫాస్పరస్ మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్.. మిమ్మల్ని ఎక్కువకాలం సంతృప్తిగా ఉంచుతుంది. అంతేకాదు, వేయించిన శనగల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు ఆకలి కోరికలు నియంత్రించుకోవాలంటే స్నాక్స్ లో భాగంగా వేయించిన శనగలు తీసుకోవచ్చు. అధిక ఫైబర్ కంటెంట్ గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేయడానికి తోడ్పడుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
వేయించిన శనగలు - ఆరోగ్య ప్రయోజనాలు !
Monday, July 15, 2024
arogyam food Health Tips అధిక ఫైబర్ కంటెంట్ ఐరన్ కాల్షియం పిండి పదార్థాలు విటమిన్లు వేయించిన శనగలు - ఆరోగ్య ప్రయోజనాలు
No comments:
Post a Comment