అనంత్ అంబానీ పెళ్లి ముంబైలో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి అతిరథమహారథులు హాజరయ్యారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పెళ్లిలో సందడి చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కాంత్, బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ స్టెప్పులతో అదరగొట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పలువురు హాజరై వధువరూలను ఆశీర్వదించారు. అయితే అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లిన ఇద్దరు ఏపీ యువకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంత్ వివాహానికి ఆహ్వానం లేకుండా అంబానీ ఇంట్లోకి పెళ్లికి వెళ్లారని యూట్యూబర్ అల్లూరి వెంకటేశ్, షఫీ అనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు.
0 Comments