వన్ ప్లస్ 12 5జీ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా ఈ వన్ ప్లస్ ఫోన్ ను రూ. 7,000 రూపాయల తక్కువ ధరకే అందుకునే అవకాశం. వన్ ప్లస్ 12 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్(12GB + 256GB) ను రూ. 64,999 ధరకు అమెజాన్ లిస్ట్ చేసింది. అయితే, ఈరోజు ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే యూజర్లకు రూ. 7,000 డిస్కౌంట్ ఆఫర్ ను జత చేసింది. ఈ ఫోన్ హైఎండ్ వేరియంట్ (16GB + 512GB) వేరియంట్ పైన కూడా ఈ ఆఫర్ లభిస్తుంది. ఈ ఫోన్ పైన అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ ఫోన్ భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ Snapdragon 8 Gen 3 తో తెచ్చింది. ఈ వేగవంతమైన ప్రోసెసర్ కి జతగా 12GB/ 16GB LPDDR5X ర్యామ్ మరియు 256GB / 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా జత చేసింది. ఈ స్పెక్స్ తో ఈ ఫోన్ గొప్ప పెర్ఫార్మెన్స్ ను అందిస్తుంది. ఈ ఫోన్ లో 2K రిజల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ మరియు Dolby Vision సపోర్ట్ కలిగిన 6.1 ఇంచ్ పవర్ఫుల్ OLED స్క్రీన్ వుంది. మంచి కెమెరా సెటప్ ను కూడా వన్ ప్లస్ అందించింది. ఈ ఫోన్ లో వెనుక ప్రో లెవల్ Hasselblad కెమెరా సిస్టం వుంది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT-808 మెయిన్ కెమెరా, 64 MP 3X పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా మరియు 48MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఇది DSLR వంటి అద్భుతమైన పోర్ట్రైట్ ఫోటోలు మరియు వీడియోలను షూట్ చేసే అవకాశం ఇస్తుంది. ఈ ఫోన్ లో 100W సూపర్ ఊక్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 50W ఎయిర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5400mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ ఫోన్ లో హైపర్ టచ్, 360 డిగ్రీల సరౌండ్ యాంటెనా వంటి మరిన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.
అమెజాన్ లో వన్ ప్లస్ 12 5జీ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ !
Monday, July 15, 2024
12GB/ 16GB LPDDR5X ర్యామ్ మరియు 256GB / 512GB ఇంటర్నల్ స్టోరేజ్ oneplus science smart phone technology అమెజాన్ లో వన్ ప్లస్ 12 5జీ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్
No comments:
Post a Comment