ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా 96మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 57మంది డీఎస్పీలు హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వైకాపాతో అంటకాగి, ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేసిన వారి జాబితాను ఇందులో పొందుపరిచినట్లు సమాచారం. మొత్తంగా 96మందిని స్థానచలనం చేయగా.. వీరిలో కొందరు వివాద రహితమైన వ్యక్తులకు డీఎస్పీలు, ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది. మిగతా 57మందిని మాత్రం హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని సూచించింది. బదిలీ అయినవారిలో సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 96మంది డీఎస్పీలు బదిలీ
الأربعاء، 31 يوليو 2024
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ లో 96మంది డీఎస్పీలు బదిలీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ బదిలీ అయిన వారిలో 57మంది డీఎస్పీలు హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని ఆదేశం
ليست هناك تعليقات:
إرسال تعليق