ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా 200కు పైగా రాకెట్లు, 20కిపైగా ఆత్మాహుతి డ్రోన్లు ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. గాజాలో పోరు ప్రారంభమైన తర్వాత ఈ గ్రూపు జరిపిన అతి పెద్ద దాడుల్లో ఇదీ ఒకటి. లెబనాన్ భూభాగం నుంచి కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయని, చాలా వాటిని కూల్చేసినట్లు టెల్‌అవీవ్ తెలిపింది. హెజ్‌బొల్లా దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం కూడా దక్షిణ లెబనాన్ ప్రాంతంపై విరుచుకుపడింది. రామ్యెహ్, హూలా పట్టణాల్లోని ఆ గ్రూపు మిలిటరీ నిర్మాణాలపై పెద్ద ఎత్తున దాడులు జరిపినట్లు వెల్లడించింది. హూలాపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందినట్లు లెబనాన్ వార్తా సంస్థ తెలిపింది.
ఇజ్రాయెల్ పైకి హెజ్‌బొల్లా 200 రాకెట్లు ప్రయోగం !
الخميس، 4 يوليو 2024
20కిపైగా ఆత్మాహుతి డ్రోన్లు international ఇజ్రాయెల్ పైకి హెజ్‌బొల్లా 200 రాకెట్లు ప్రయోగం ఇజ్రాయెల్ సైన్యం కూడా దక్షిణ లెబనాన్ ప్రాంతంపై విరుచుకుపడింది ఈ గ్రూపు జరిపిన అతి పెద్ద దాడుల్లో ఇదీ ఒకటి
ليست هناك تعليقات:
إرسال تعليق