ఆఫ్రికాలోని మౌరిటానియాలో సముద్రం మధ్యలో బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ తప్పిపోయినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ బుధవారం తెలిపింది. పశ్చిమ ఆఫ్రికా తీరంలో వలస విషాదాల్లో ఇదొక ఘోరమైన సంఘటనగా తెలిపింది. సుమారు 300 మంది వలసదారులతో వెళ్తున్న బోటు మారిటానియా రాజధాని నాఖ్కోట్ సమీపంలో సోమవారం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. సమాచారం అందుకున్న కోస్టు గార్డు సిబ్బంది 120 మందిని రక్షించినట్లు బుధవారం ఐఓఎం ఒక ప్రకటనలో తెలిపింది. దురదృష్టవశాత్తు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. తప్పిపోయిన వారి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొంది. ఇక 10 మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపింది. ఎక్కువగా పిల్లలే ఉన్నట్లుగా తెలిపింది.
సముద్రం మధ్యలో బోటు బోల్తా పడి 15 మంది మృతి !
الخميس، 25 يوليو 2024
120 మందిని రక్షించిన కోస్టు గార్డు సిబ్బంది international ఆఫ్రికాలోని మౌరిటానియాలో ఎక్కువగా పిల్లలే సముద్రం మధ్యలో బోటు బోల్తా పడి 15 మంది మృతి
ليست هناك تعليقات:
إرسال تعليق