అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌లో వాటాల కొనుగోలు ద్వారా సిమెంట్ వ్యాపారంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్ తన దూకుడును పెంచింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్ కంపెనీ అయిన అంబుజా సిమెంట్ ద్వారా రూ.10,422 కోట్లకు కొనుగోలు చేసేందుకు బైండింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. పెన్నా సిమెంట్‌ను సొంతం చేసుకోవడం ద్వారా అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 14 మిలియన్ టన్నుల మేర పెరగనుంది. తద్వారా గ్రూప్ మొత్తం సామర్థ్యం 89 మిలియన్ టన్నులకు పెరగనుంది. పెన్నా ప్రతాపరెడ్డి, వారి కుటుంబసభ్యుల నుంచి నూరు శాతం షేర్లను అంబుజా కొనుగోలు చేయనుంది. పెన్నాకు ఏపీ, తెలంగాణ, రాజస్థాన్ (నిర్మాణంలో ఉన్న) సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ కొనుగోలు వల్ల దేశంలో అదానీ గ్రూప్ మార్కెట్ వాటా 2 శాతం పెరగనుండగా, దక్షిణ భారతంలో 8 శాతం మేర వృద్ధి చెందనుంది.
అదానీ గ్రూప్ చేతికి పెన్నా సిమెంట్ !
الخميس، 13 يونيو 2024
422 కోట్లకు కొనుగోలు చేసేందుకు బైండింగ్ అగ్రిమెంట్ business అదానీ గ్రూప్ చేతికి పెన్నా సిమెంట్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.10
ليست هناك تعليقات:
إرسال تعليق