శ్రీవారి 'స్పెషల్ దర్శనం' టికెట్లు విడుదల !


శ్రీవారి భక్తులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను సెప్టెంబర్‌ నెలకు సంబంధించి ఈ రోజున ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబర్‌ నెలకు సంబంధించి వసతి గదల కోటాను అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. టికెట్లు ఆన్​లైన్​లో విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే భక్తులు పెద్ద ఎత్తున బుకింగ్ చేసుకున్నారు. ఈ నెల 27వ తేదీ తేదీన తిరుమల – తిరుపతి శ్రీవారి సేవా కోటాను ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. నవనీత సేవకు సంబంధించిన టికెట్‌లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవకు సంబంధించినవి మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in/home/dashboard వెబ్‌ సైట్‌లో సేవా టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ అధికారులు చెప్పారు.

Post a Comment

0 Comments