కన్నడ భాష, ప్రాంతం, నీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి కన్నడ వాసికి ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చిన ఆయన రాష్ట్రంలో నివసించే వారంతా స్థానిక భాషను నేర్చుకోవాలని సూచించారు. ''కన్నడిగులు ఉదారంగా ఉంటారు. అందుకే కన్నడ రాకున్నా.. ఇతర భాషలు మాట్లాడేవారు కూడా ఇక్కడ స్వేచ్ఛగా నివసిస్తున్న వాతావరణం ఉంది. కన్నడ మీద ప్రేమ పెంచుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మతోన్మాదులుగా మారకూడదు. భాష, ప్రాంతం, దేశం మీద ప్రేమ, గౌరవం పెంచుకోవాలి. రాష్ట్రంలో కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకోసం రాష్ట్రంలో నివసించే వారంతా కన్నడ నేర్చుకోవాలి. కన్నడ తప్ప మరే భాష మాట్లాడకూడదని ప్రతిజ్ఞ చేయాలి'' అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి లేదని కర్ణాటక సీఎం పేర్కొన్నారు. వాళ్ల మాతృభాషలోనే మాట్లాడుతారని.. ఇక్కడ కూడా స్థానిక భాషలోనే మాట్లాడాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. విధాన సౌధలో ఏర్పాటు చేయనున్న నాదాదేవీ భువనేశ్వరి మాత కంచు విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో నివసించేవాళ్లంతా కన్నడ నేర్చుకోవాలి !
الخميس، 20 يونيو 2024
karnataka ఇతర భాషలు మాట్లాడేవారు కూడా ఇక్కడ స్వేచ్ఛగా నివసిస్తున్న వాతావరణం కర్ణాటకలో నివసించేవాళ్లంతా కన్నడ నేర్చుకోవాలి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
ليست هناك تعليقات:
إرسال تعليق