ఇప్పుడు కేవలం ఇంటర్వెల్ మాత్రమే అసలు సినిమా ముందుంది అంటూ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలు, శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం జగన్ చేశారు. "శకుని పాచికలనే సబ్జెక్ట్ కేవలం ఇంటర్వెల్ మాత్రమే. శ్రీకృష్ణుడు తోడున్నా పాండవులు ఓడిపోయారు. కాలం గడుస్తున్న కొద్దీ హనీమూన్ పీరియడ్ ముగుస్తుంది. ఓడిపోయామన్న భావన మనసులో నుంచి తీసేయండి. మనం ఓడిపోలేదన్న విషయాన్ని గుర్తించండి. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదు". "చెప్పిన పని చేశాం కాబట్టి ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగలుగుతాం. మనం తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ప్రతి ఒక్కరూ అర్జునుడు మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారు. ఎన్నికల ఫలితాలపై చాలామంది ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. అవన్నీ నా దృష్టికి తీసుకు వస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉండండి, నేను వచ్చి కార్యకర్తలను కలుస్తా"నని జగన్ అన్నారు.
శ్రీకృష్ణుడు తోడున్నా పాండవులు ఓడిపోయారు !
الخميس، 20 يونيو 2024
Andhra Pradesh Jaganmohan reddy YSRCP పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలు శ్రీకృష్ణుడు తోడున్నా పాండవులు ఓడిపోయారు శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం
ليست هناك تعليقات:
إرسال تعليق