బీజేపీ రాజ్యసభ సభ నాయకుడిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఆ పార్టీ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన పీయూష్ గోయల్ స్థానంలో ఆయన్ని నియమించింది. గోయల్ జులై 5, 2010న రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2021 జులై 14న ఆయన్ని రాజ్యసభ సభా నాయకుడిగా ప్రకటించారు. జూన్ 4న లోక్‌సభ ఎంపీగా ఎన్నికై, జూన్ 24న దిగువ సభలో ప్రమాణ స్వీకారం చేశారు. జేపీ నడ్డా తొలిసారిగా 2012, ఏప్రిల్ 3న రాజ్యసభకు ఎన్నికయ్యారు. జూన్ 24న ఆయనను సభా నాయకుడిగా నియమిస్తూ పార్టీ నిర్ణయించింది.
బీజేపీ రాజ్యసభ నాయకుడిగా నియామకం జేపీ నడ్డా !
الاثنين، 24 يونيو 2024
BJP national కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్థానంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు బీజేపీ రాజ్యసభ నాయకుడిగా నియామకం జేపీ నడ్డా
ليست هناك تعليقات:
إرسال تعليق