ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. జూన్ 5న కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేక్‌ఆఫ్ అవుతుండగా విమానంలో కుడివైపు ఇంజిన్‌లో చిన్న పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా విమానం రెక్కల వద్ద మంటలు లేచాయి. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్‌లు గాల్లోకి లేచిన 30 నిమిసాల్లోనే విమానాన్ని పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో విమానం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. పేలుడు జరిగి మంటలంటుకున్న సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 400 మంది దాకా ఉన్నారు. ఘటన జరిగినపుడు విమానంలో ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయి. మరోపక్క వాతావరణం కూడా అనుకూలంగా లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య విమానాన్ని సురక్షితంగా వెనక్కు మళ్లించి ల్యాండ్ చేసిన పైలట్‌లను అందరూ అభినందిస్తున్నారు.
0 Comments