మా నోటి దురుసు వల్లే ఓడిపోయామంటూ చాలా మంది అంటున్నారు. అదే నిజమైతే ఇకపై సరిదిద్దుకుంటామని మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తాడేపల్లిలో అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తున్నామన్నారు. లోపాలు సరిదిద్దుకుని భవిష్యతులో ముందుకు వెళ్తామన్నారు. ఈ ఎన్నికల్లో తమకు ఎక్కువ మొత్తంలో సీట్లు రాకపోయినా, 40 శాతం ఓట్ల షేర్ ఉందన్నారు. తమకు ప్రతిపక్షం కొత్తేమీ కాదని, పదేళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నామంటూ గుర్తు చేశారు. ఓడిపోయామని ఇంట్లో కూర్చోమని, గతంలో కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడ్డామన్నారు. ప్రస్తుతం కూడా అలాగే ఉంటామన్నారు. ఓటమి పాలై భయపడి ఎక్కడికీ పారిపోమని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. అధికార పార్టీకి కొంత సమయం ఇస్తామని, ఆ తర్వాత వాళ్ల తప్పులపై పోరాడుతామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైసీపీ అధినేత జగన్ వెంటే ఉంటామని, ఆయనతోనే నడుస్తామన్నారు. తమ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదంటూ హితవు పలికారు. ప్రజలు అన్నీ చూస్తున్నారన్నారు.
మా నోటి దురుసు వల్ల ఓడిపోతే సరిదిద్దుకుంటాం !
الخميس، 13 يونيو 2024
Andhra Pradesh YSRCP మా నోటి దురుసు వల్లే ఓడిపోతే సరిదిద్దుకుంటాం మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్
ليست هناك تعليقات:
إرسال تعليق