జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్‌ను మరోసారి నియమించారు. మూడోసారి కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 10 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానున్నట్లు క్యాబినేట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డా.పీకే మిశ్రా ప్రధాని మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగనున్నారు. మరోవైపు ప్రధాని మోడీకి సలహాదారులుగా అమిత్ ఖేర్, తరుణ్ కపూర్‌లను నియమించారు. అజిత్ దోవల్ కేరళ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. అలాగే మాజీ ఇండియన్ ఇంటెలిజెన్స్ అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి. 1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన ఆయన భారత్‌లో అత్యంత పిన్న వయస్కుడైన పోలీస్ అధికారిగా కీర్తి చక్ర మెరిటోరియస్ సర్వీస్, సైనిక సిబ్బందికి గాలంటరీ అవార్డును అందుకున్నారు. 2016లో సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలకోట్ వైమానిక దాడులు అజిత్ దోవల్ పర్యవేక్షణలోనే జరిగాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటును పరిష్కరించేందుకు కూడా చర్యలు తీసుకున్నారు.
జాతీయ భద్రతా సలహాదారుగా మళ్లీ అజిత్ దోవల్ !
الخميس، 13 يونيو 2024
40 శాతం ఓట్ల షేర్ ఉంది national క్యాబినేట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ వెల్లడి జాతీయ భద్రతా సలహాదారుగా మళ్లీ అజిత్ దోవల్ సీట్లు రాకపోయినా సెక్రటరీగా డా.పీకే మిశ్రా ప్రధాని మోడీకి ప్రిన్సిపల్
ليست هناك تعليقات:
إرسال تعليق