ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ పూర్తిస్థాయి బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలమ్మ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. వార్షిక పద్దుపై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. నిన్న ఎంఎస్ఎంఈ రంగ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి సంప్రదింపులు జరిపారు. వచ్చే నెలలో జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.
రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీ !
السبت، 22 يونيو 2024
national ఢిల్లీలోని భారత్ మండపంలో సమావేశం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీ వార్షిక పద్దుపై వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు
ليست هناك تعليقات:
إرسال تعليق