తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ పరీక్షల తేదీల మధ్య వ్యవధి ఎక్కువగా ఉండాలని సూచించారు. పరీక్షల మధ్య తక్కువ వ్యవధి ఉండటంతో ఉద్యోగార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3కి ఉద్యోగాలను కలుపుతామన్న హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని సూచించారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అన్న మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతిని బకాయిలు సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. చెప్పిన మాట ప్రకారం జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ !
السبت، 22 يونيو 2024
telangana ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ గ్రూప్ 2 గ్రూప్ 3కి ఉద్యోగాలను కలుపుతామన్న హామీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
ليست هناك تعليقات:
إرسال تعليق