ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు తమ ఫోన్లలో మెసేజింగ్ ప్లాట్ ఫారమ్ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. కానీ చాలా మంది వినియోగదారులకు తమ స్మార్ట్ వాచ్ లో వాట్సాప్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చని లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇప్పటికీ తెలియదు. వేర్ ఓఎస్ సాయంతో మీరు ఫోన్ లేకుండా స్మార్ట్ వాచ్ లో సులభంగా చాట్ చేయవచ్చు. ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి వేర్ ఓఎస్ యాప్ ని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్ స్టాలేషన్ తర్వాత యాప్ ని ఓపెన్ చేసి మీ స్మార్ట్ వాచ్ తో ఫోన్ ను కనెక్ట్ చేయడానికి స్క్రీన్ పై వచ్చే ఇన్ స్ట్రక్షన్స్ ను ఫాలో అవ్వండి. ఇది కాకుండా వినియోగదారుల సౌలభ్యం కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ లో కొన్ని కంపెనీల వాచీల కోసం ప్రత్యేక యాప్లను కూడా చూడవచ్చు. దీని తర్వాత మీ వేర్ ఓఎస్ స్మార్ట్ వాచ్ లో గూగుల్ ప్లే స్టోర్ ని తెరవండి. ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ కోసం సెర్చ్ చేసి ఇన్ స్టాల్ చేయండి. ఒకవేళ అందులో మీకు వాట్సాప్ కనిపించకపోతే, మీ స్మార్ట్ వాచ్ వాట్సాప్ ను సపోర్ట్ చేయడం లేదని అర్థం. దీని కారణంగా ఈ ఫీచర్ ఇందులో పని చేయకపోవచ్చు. స్మార్ట్ వాచ్ లో వాట్సాప్ ఓపెన్ చేయాలి. దీని తర్వాత మీకు స్మార్ట్ వాచ్ లో 8 అంకెల కోడ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. దీనిలో మీరు అకౌంట్ కు ఈ డివైస్ జోడించాలనుకుంటున్నారా అని రిక్వెస్ట్ వస్తుంది. దీని తర్వాత మీరు కనెక్ట్ ఆప్షన్ పై నొక్కాలి. అనంతరం మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఆ 8 అంకెల కోడ్లను నమోదు చేయాలి. స్మార్ట్ వాచ్ లో వాట్సాప్ ను సెటప్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. అక్కడ మీకు మీ మెసేజ్ లు, చాట్ లు కనిపిస్తాయి. మీరు దానిని ఓపెన్ చేయడం ద్వారా కూడా చాట్ ను తెరవవచ్చు. మెసేజ్ కి రిప్లై ఇవ్వడానికి, మీరు రిప్లైని నొక్కాలి. కొత్త మెసేజ్ పంపడానికి, మీరు "+" ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఆపై సెండ్ పై క్లిక్ చేయాలి. అంతే మీ మెసేజ్ సెండ్ అవుతుంది. స్మార్ట్ వాచ్ లో వాట్సాప్ ను సెటప్ చేసిన తర్వాత మీరు మెసేజ్ లను చదవడానికి, పంపడానికి దాన్ని ఉపయోగించవచ్చు. కానీ వాట్సాప్లో మీరు కాల్లు లేదా వీడియో కాల్లు చేయలేరు అని గుర్తుంచుకోండి. మొబైల్లో మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
0 Comments