హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయం శని, ఆదివారాల్లో మూసివేసి ఉంటుందంటూ గూగుల్ మ్యాప్స్‌లో వచ్చిన అప్డేట్‌పై అర్చకులు రంగరాజన్ మండిపడ్డారు. గూగుల్ సంస్థకు ఆలయం మూసివేస్తున్నట్టు ఎవరు చెప్పారని, భక్తులు కూడా గూగుల్‌ను ప్రశ్నిస్తూ రిప్లై ఇవ్వాలని కోరారు. గూగుల్‌ను నమ్ముకుంటే హుస్సేన్‌సాగర్‌లోకి పోతామని...భక్తులు 4జీ, 5జీలను కాకుండా బాలాజీని నమ్మాలని తెలిపారు. అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్ మాత్రమే కాదు, అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.
0 Comments