రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. శనివారం రామోజీ ఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్ భవన సముదాయంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచగా.. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళి అర్పించారు. వారిలో ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు ఉన్నారు.
రామోజీరావుకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
الأحد، 9 يونيو 2024
Andhra Pradesh telangana రామోజీ ఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్ భవన సముదాయంలో భౌతికకాయం రామోజీరావుకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
ليست هناك تعليقات:
إرسال تعليق