హైదరాబాద్ లో యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న యువ ప్రతిభావంతులకు అవకాశం ఇచ్చే ఓ కార్యక్రమానికి రామ్‌గోపాల్ వర్మ శ్రీకారం చుట్టాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్జీవీ తన కొత్త కార్యక్రమం యువర్ ఫిల్మ్ గురించి ఈ సందర్భంగా వివరించాడు. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే యువ ప్రతిభావంతులను ప్రోత్సహించడమే తమ ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యమని స్పష్టం చేశాడు. ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ వివరాలను వివరించాడు. ఈ కార్యక్రమంలో పోటీకి ఎంపికైన షార్ట్ ఫిలింస్ మేకర్స్, ఆర్జీవీ డెన్ ప్రొడ్యూసర్ రవి పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఈ కాంటెస్ట్ కు ఎంట్రీలు రావడం విశేషం. వివిధ ప్రాంతాల్లో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తమలో ఎంతో ప్రతిభ ఉండి కూడా అవకాశాలు పొందలేకపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి ఇండస్ట్రీతో ఒక యాక్సెస్ ఇచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కాంటెస్ట్ ఆర్జీవీ యువర్ ఫిల్మ్. ఈ కాంటెస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత దాదాపు 400 ఎంట్రీలు వచ్చాయి. ఇవి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఉన్నాయి. వీటిలో 11 షార్ట్ ఫిలింస్ షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేశాం అని ఆర్జీవీ చెప్పాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఆర్జీవీ కొన్ని సినిమాలు తీశాడు. వాటిలో ఆ ఇద్దరి పాత్రలనూ చాలా దారుణంగా చూపించాడు. ఇప్పుడా ఇద్దరూ ఏపీని ఏలబోతున్నారు. మరి ఇప్పుడు ఆర్జీవీ ఏం చేయబోతున్నాడు? వాళ్లపై మరో విధంగా సినిమాలు తీస్తాడా? ఇదే ప్రశ్నను మీడియా అడిగింది. దీనికి ఆర్జీవీ సమాధానమిస్తూ "ఇక మీదట రాజకీయాల జోలికి వెళ్లను. నాకు తెలుసు మీరు ఈ ప్రశ్న అడుగుతారని. అందుకే ఇంతకుముందే చెప్పినట్లు నేను ఇక రాజకీయాలపై సినిమాలు తీయను. ఇక నుంచి దేవుళ్లపై మూవీస్ చేస్తాను" అని ఆర్జీవీ చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వారు. ఆర్జీవీ గతంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్, వ్యూహంలాంటి సినిమాలు తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు వ్యతిరేకంగా తీసినవే. బాబును విలన్ లాగా, పవన్ కల్యాణ్ ను మరీ ఓ కమెడియన్ లాగా అతడు చూపించిన తీరు టీడీపీ, జనసేన అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో తానిక రాజకీయాల జోలికి వెళ్లనని ఆర్జీవీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రాజకీయాలపై సినిమాలు తీయను !
السبت، 15 يونيو 2024
Andhra Pradesh cinema telangana ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ రాజకీయాలపై సినిమాలు తీయను రామ్‌గోపాల్ వర్మ వివిధ రాష్ట్రాల నుంచి ఈ కాంటెస్ట్ కు ఎంట్రీలు రావడం విశేషం
ليست هناك تعليقات:
إرسال تعليق