అపోలో హాస్పిటల్ ఛారిటబుల్ ట్రస్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వింగ్‌కు నేతృత్వం వహిస్తున్న ఉపాసన కొణిదెల వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ భారత శాఖకు జాతీయ రేంజర్ కమ్ అంబాసిడర్"గా నియమితులయ్యారు. అపోలో హాస్పిటల్స్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో నాలుగు సంవత్సరాల పాటు ఉపాసన ఈ పదవిలో కొనసాగనున్నారు. 'అటవీ అధికారులు ఉపేక్ష యోధుల లాంటి వారు, వారు జంతువులు, మానవుల భద్రతకు భరోసా ఇస్తున్నారు' అని ఉపాసన కొణిదెల ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. అపోలో హాస్పిటల్స్‌లో అటవీ అధికారులు, స్థానిక వన్యప్రాణి సంరక్షణ కమిటీ సభ్యులకు ఏ సందర్బంలోనైనా గాయపడితే నాణ్యమైన వైద్యం అందించడానికి తాను కృషి చేస్తానని ఉపాసన చెప్పారు. 'మానవ వన్యప్రాణుల సంఘర్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి నా హృదయపూర్వక ప్రయత్నం ఈ సహకారంతో బలపడుతుంది. ప్రకృతిని గౌరవించండి, ప్రతిఫలంగా అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది' అని ఉపాసన కొణిదెల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన.. పలు సామాజిక, సేవా కార్యక్రమాలను తరచూ చేస్తుంటారు.
డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా నేషనల్ రేంజర్ కమ్ అంబాసిడర్ గా ఉపాసన !
Telugu Lo Computer
0
Comments
Post a Comment