తెలంగాణలో తొలి అన్న క్యాంటీన్ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 100 ఫీట్ రోడ్డులో ప్రారంభమైంది. క్యాంటీన్‌ను సీబీఎన్ ఫోరమ్ వ్యవస్థాపకుడు జెనెక్స్ అమర్ ప్రారంభించారు. పేదలకు కనీసం ఒక పూట భోజనం అందించాలనే ఉద్దేశ్యంతో అమర్ క్యాంటీన్ ప్రారంభించినట్లు వివరించారు. ఈ క్యాంటీన్‌లో కేవలం ఐదు రూపాయలకే ఫుల్ మీల్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. అన్న క్యాంటీన్‌లో భోజనం చేసే వారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రోజూ 500 మంది పేదలకు అన్నం పెట్టడమే ఈ క్యాంటీన్ లక్ష్యం.
0 Comments