చైనాలోని ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లోని ఒక పార్కులో నలుగురు అమెరికన్ దుండగులు అధ్యాపకులపై కత్తులతో దాడికి చేశారు. ఈ అధ్యాపకులంతా చైనాలోని తమ భాగస్వామ్య విశ్వవిద్యాలయాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఈ ఘటన నేపధ్యంలో అయోవా కాంగ్రెస్ ప్రతినిధి మరియాన్నెట్ మిల్లర్ మీక్స్ మాట్లాడుతూ ఈ దాడిలో గాయపడిన అధ్యాపకులను తగిన వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ దాడికి సంబంధించిన వివరాలను అమెరికా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కార్నెల్ కళాశాల అధ్యాపకులు చైనాలోని భాగస్వామ్య విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తుండగా ఈ దాడి జరిగిందని వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌ తెలిపింది. కార్నెల్ కాలేజ్ ప్రెసిడెంట్ జోనాథన్ బ్రాండ్ ఈ ఘటనను ధృవీకరించారు. మరోవైపు ఈ దాడికి సంబంధించిన నివేదికలు తమకు అందాయని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యాపకులు ఏ మేరకు గాయపడ్డారు? వీరిపై దాడికి కుట్ర జరిగిందా? లేక మరేదైనా కారణమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని కార్నెల్ ప్రతినిధి జెన్ వీజర్ తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ