అమెరికాలోని లాస్ వెగాస్‌లోని రెండు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో ఓ వ్యక్తి మంగళవారం కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఐదుగురిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉంది. నిందితుడిని 57 ఏళ్ల ఎరిక్ ఆడమ్స్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తరువాత నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒకే కాంప్లెక్స్‌లోని రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్లలో అతను మంగళవారం కాల్పులు జరిపాడు. కాల్పులకు గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ఆడమ్స్‌ను ఎప్పుడు, ఎలా అరెస్టు చేశారో కూడా వారు చెప్పలేదు. అయితే మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని పోలీసులు వివరాలను వెల్లడించారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో వరుసగా చోటుచేసుకుంటున్న కాల్పుల ఘటనల పట్ల అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Post a Comment