హైదరాబాద్ నగరంలో గురువారం కురిసిన వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బయో డైవర్సిటీ మాదాపూర్ వరకు ట్రాఫిక్ ఆగిపోవడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఐటీ ఉద్యోగులు దశలవారీగా ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ తమ గమ్య స్థానాలకు వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు. సైబరాబాద్ పరిధిలో అటు గచ్చిబౌలి మొదులుకుని గచ్చిబౌలి, మాదాపూర్ బయో డైవర్సిటీ సిగ్నల్,ఐకియా, హైటెక్ సిటీ ఫ్లైఓవర్,జేఎన్‌టీయూ ఫ్లైఓవర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. గంటపాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురియడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడా నిలిచిపోయాయని పోలీసులు చెబుతున్నారు. వర్షం తగ్గగానే ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్డెక్కాయి. ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. నానక్ రామ్ గూడా మొదులుకుని గచ్చిబౌలీ, బయోడైవర్సిటీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫలితంగా మాదాపూర్ వెళ్లాలన్నా.. ఇటు జేఎన్‌టీయూ వెళ్లాలన్నా ఐకియా సిగ్నల్ మీది నుంచి వెళ్లాల్సి ఉంది. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ?
الخميس، 27 يونيو 2024
telangana ఐటీ ఉద్యోగులు దశలవారీగా ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ తమ గమ్య స్థానాలకు వెళ్లాలని సూచిస్తున్నారు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ?
ليست هناك تعليقات:
إرسال تعليق