ఒడిశా నుంచి హైదరాబాద్ నగరానికి రైల్లో గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర నిందితుడిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3.50లక్షల విలువైన 14కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సికింద్రాబాద్ జీఆర్పీ డీఎస్పీ జావేద్, ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం, రాయగడ జిల్లా చంద్రపూర్ రాణా పరిధిలోని గుండూరిగూడకు చెందిన బహన్ స్వల్సెంగ్ (38) గంజాయితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఈక్రమంలో రైల్లో తనిఖీలు చేపట్టిన జీఆర్పీ సిబ్బంది సీతారాములు, హరిలాల్, నాగుబాషా, కె.భవానీశంకర్లు నిందితుడి వద్ద ఉన్న బ్యాగుల్లో గంజాయి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో భరత్‌తో కలిసి గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా నిందితుడు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన జీఆర్పీ పోలీసులు, పరారీలో ఉన్న భరత్ అనే వ్యక్తి కోసం దర్యాప్తు చేపట్టారు.
గంజాయి నిందితుడిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ !
الخميس، 27 يونيو 2024
telangana గంజాయి నిందితుడిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ రూ.3.50లక్షల విలువైన 14కేజీల గంజాయి స్వాధీనం రైల్లో గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర నిందితుడిని
ليست هناك تعليقات:
إرسال تعليق