ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన బెయిల్ పిటిషన్లు హైకోర్టు కొట్టేసింది. హైకోర్టులో నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు పిన్నెల్లి. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం సహా పిన్నెల్లి పై మూడు కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటికి వరకు ఈ కేసుల్లో మధ్యంతర బెయిల్ పిన్నెల్లి బయట ఉన్నారు. ఇటీవల మొత్తం నాలుగు కేసుల్లో మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తుది తీర్పు వెలువరించింది. ఆ నాలుగు పిటిషన్లను కొట్టేసింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు
الأربعاء، 26 يونيو 2024
Andhra Pradesh ఈవీఎం ధ్వంసం సహా పిన్నెల్లి పై మూడు కేసులు బెయిల్ పిటిషన్లు హైకోర్టు కొట్టేసింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు
ليست هناك تعليقات:
إرسال تعليق