దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది ఉపశమనం కోసం జ్యూస్లు, కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. చెరుకు రసం సహా పలు రకాల పండ్ల రసాలు తాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. చరకు సహా ఎక్కువ చక్కెర కలిగి ఉండే జ్యూస్లు, కూల్ డ్రింక్స్ వినియోగం తగ్గించాలని వెల్లడించారు. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారంతో ఆరోగ్యకర ఆహారపు అలవాట్లను ప్రోత్సహించేందుకు 17 కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. చెరకు రసంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం పట్ల వీలైనంత తక్కువగా తీసుకోవాని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తెలిపింది. అంతే కాదు, ఆరోగ్యానికి హాని కలిగించే కూల్ డ్రింక్స్, చక్కెర యాడ్ చేసిన పండ్ల రసాలు, టీ, కాఫీలకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది. పండ్లతో పాటు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను సిఫార్సు చేసింది. సమతుల ఆహారం, మెరుగైన ఆహారపు అలవాట్లతో కూడిని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజా మార్గదర్శకాల్లో చెరకు రసం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. 100 మిల్లీ లీటర్ల చెరకు రసంలో 13 - 15 గ్రాముల చక్కెర ఉంటుందని తెలిపింది. "దేశంలో ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా వినియోగించే చెరకు రసంలో చక్కెర అధికంగా ఉంటుంది. వీలైనంత వరకు వినియోగాన్ని తగ్గించాలి" అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. పెద్దలు ప్రతి రోజూ 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదని వైద్యులు వెల్లడిస్తున్నారు. 7 నుండి 10 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు రోజుకు 24 గ్రాములకు పరిమితం చేయాలని సూచిస్తున్నారు. చెరకు రసంలో ఉండే పోలికోననాల్ నిద్రలేమి సహా పలు సమస్యలకు కారణం అవుతుందన్నారు. చక్కెర కలిపిన పండ్ల రసాలను తీసుకోవద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సూచించింది. పండ్ల రసాలకు బదులుగా తాజా పండ్లు తీసుకోవాలని వెల్లడించింది. పండ్లలోని ఫైబర్, పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపింది. శీతల పానీయాలు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయని తెలిపింది. చక్కెర, ఆర్టిఫీషియల్ స్వీటెనర్లతో పాటు చక్కెర కలిపిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపింది. "కూల్ డ్రింక్స్ అనేవి నీళ్లు, తాజా పండ్లకు ప్రత్యామ్నాయం కాదు. వాటిని వీలైనంత వరకు వాటిని తీసుకోకపోవడం మంచిది” అని వెల్లడించింది. మజ్జిగ, నిమ్మరసం, పండ్లు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఉత్తమం అని తెలిపింది. అధిక కెఫీన్ కంటెంట్ ఉన్న టీ, కాఫీని వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సూచించింది. 150ml కప్ బ్రూ కాఫీలో 80 నుండి 120 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుందని తెలిపింది. టీలో 30 నుండి 65 మిల్లీ గ్రాముల వరకు ఉంటుందని వెల్లడించింది. రోజువారీ కెఫిన్ 300 మిల్లీ గ్రాములకు మించి ఉండకూడదని వెల్లడించింది. టీ, కాఫీలోని టానిన్లు, ఐరన్ శోషణను నిరోధిస్తాయని ICMR తెలిపింది. దీంతో ఐరన్ లోపం, రక్తహీనతకు దారితీసే అవకాశం ఉందని వెల్లడించింది. భోజనానికి ముందు, తర్వాత కనీసం ఒక గంట వరకు టీ, కాఫీని తీసుకోవద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సూచించింది. అధికంగా కాఫీ తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. చక్కెర కలిపిన డ్రింక్స్ ను మానేసి, వాటి స్థానంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం, సీ ఫుడ్స్ లాంటి సమతుల ఆహారం తీసుకోవాలని వెల్లడించింది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నూనె, చక్కెర, ఉప్పు వినియోగాన్ని పరిమితం చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ